Bigg Boss : ‘బిగ్ బాస్ 5’ వరస్ట్ కంటెస్టెంట్ ని గట్టిగా టార్గెట్ చేసేసారు..ఈవారం తనేమో?

Bigg Boss : ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న బుల్లితెర గ్ర్యాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఆల్రెడీ 90 రోజులు క్రాస్ చేసిన ఈ షో ద్వారా ఆయా కంటెస్టెంట్స్ కి సంబంధించిన లక్షణాలు, స్వభావాలు బాగా తెలుస్తాయి. అయితే ఈ సారి సీజన్లో అసలు ఓ కంటెస్టెంట్ ఇప్పటి వరకు ఎలా సర్వైవ్ అవుతూ వచ్చిందా అని అందరికీ ఆశ్చర్యంగా ఉన్న ప్రశ్న.

అది ఇంకెవరో కాదు ఆర్ జె కాజల్ నే.. మొదటి వారం నుంచే ఆమె నెగిటివ్ మార్క్ ని తెచ్చుకుని ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. అయినా కూడా ఏదోలా సేవ్ అవుతూ వస్తుంది. ఇక ఈ వారం నామినేషన్ లో కూడా ఈమె నిలబడింది. కానీ ఈసారి మాత్రం ఈమెని ఎట్టి పరిస్థితుల్లో బయటకి పంపే పనిలో అంతా ఉన్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాపిక్ గా నడుస్తుంది. ఈమెని మాత్రం ఎలా అయినా ఓటింగ్స్ తగ్గించి మిగతా వాళ్లకి అన్నీ వేసి ఎలిమినేట్ చేసేయాలని టార్గెట్ చేశారు. ఇక ఈ వారం ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్లిపోతుందో లేదో చూడాలి మరి.