Bigg Boss : బిగ్ బాస్ మొదటి సీజన్ సమయంలో కంటెస్టెంట్లు ఖర్చు చేసిందేమీ లేదు. రెండో సీజన్ విషయానికొచ్చేసరికి విన్నర్ కౌశల్ మండా సహా పలువురు కంటెస్టెంట్లు ముందస్తుగా కొంత మేర సొమ్ము ఖర్చు చేసి, ఓటింగ్‌ని ప్రభావితం చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాతి సీజన్ నుంచి ఖర్చు మరింత పెరుగుతూ వచ్చింది.
ఈసారి సీజన్ విషయానికొస్తే, రికార్డు స్థాయిలో కంటెస్టెంట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా షన్నూ మీద ఎక్కువ ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూ ట్యూబర్ షన్ముఖ్ జస్వంత్‌కి అభిమానులు ఎక్కువే వున్నారు. దానికి తోడు పెయిడ్ ప్రమోషన్స్ వర్కవుట్ అవుతున్నాయి.
అన్ స్టాపబుల్ షన్నూ.. అనే హ్యాష్ ట్యాగ్‌తో షన్నూని ప్రమోట్ చేస్తున్నారు అతని అభిమానులు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో సొమ్ము ఖర్చవుతోందట. ఐదో సీజన్ విన్నర్ షన్ముఖ్.. అని, షో ప్రారంభానికి ముందే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే అన్నీ నడుస్తున్నాయి. హౌస్‌లో షన్నూ ఏమీ చేయకపోయినా, అతను ఇన్నాళ్ళు హౌస్‌లో ఎలా కొనసాగుతున్నాడనే డౌట్ చాలామందికి వస్తోంది.
షన్నూ మాత్రమే కాదు, రవి కూడా బాగానే ఖర్చు చేశాడట. ఔనా, రవికి ఎందుకు ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చిందట.? అని అతని అభిమానులే జుట్టుపీక్కుంటున్నారు. నో డౌట్, అందరిలోకీ రవి పాపులర్. అయినాగానీ, బిగ్ బాస్‌కి వెళ్ళడమంటే, బయట పాజిటివ్ ఫాలోయింగ్ సంపాదించడం కష్టమవుతుంది. అందుకే, రవి అంతలా ఖర్చపెట్టాడంటున్నారు.
బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు అలాగే 25 లక్షల విలువైన ప్లాట్.. అని ఇటీవల కింగ్ అక్కినేని నాగార్జున (హోస్ట్) ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఆ సొమ్ముకి సమానంగా, అంతకు మించి ఈసారి ఒకరిద్దరు కంటెస్టెంట్లు ఖర్చు చేసి వుంటారన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం.
ఓ ఫిమేల్ కంటెస్టెంట్ కూడా.. అనూహ్యంగా ఖర్చు చేస్తోందని అంటున్నారు. అయితే, ఇదంతా నిజమేనా.? ఇంత ఖర్చు చేసి ఏం సాధిద్దామని.? అని బిగ్ బాస్ వీక్షకులు పెదవి విరుస్తున్నారు.