అతి తక్కువ ఓట్లతో చిరవి స్ధానంలో నిలిచిన కంటెస్టెంట్ ఎవరంటే..?

బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతోంది. హిందీలో మంచి గుర్తింపు పొందిన రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతుంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో మొత్తం 6 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

గడిచిన ఆరవ వారంలో సుదీప ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం ఏడవ వారం కొనసాగుతోంది. ఇక ఏడవ వారానికి సంబంధించి ఇప్పటికే నామినేషన్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ వారంలో బిగ్ బాస్ తక్కువ మంది కంటెస్టెంట్లను నామినేట్ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడవ వారంలో కంటెస్టెంట్ల ఓటింగ్ విషయాలలో తారుమారు అయ్యాయి. ఎప్పటిలాగే రేవంత్ అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో నిలవగా శ్రీహాన్ రెండవ స్థానంలో నిలిచాడు.

ఆ తర్వాత బాలాదిత్య, ఆదిరెడ్డి మూడు నాలుగు స్థానాల్లో నిలువగా ఎవరు ఊహించని విధంగా తన ఆటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని ఫైమా ఈ వారంలో ఐదవ స్థానం కైవసం చేసుకుంది. ఇక ఆరవ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇస్తూ పర్ఫార్మ్ చేసిన కీర్తి ఆరవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాసంతి, గీతు రాయల్, రోహిత్ మెరీనా నిలిచారు. ఇక ఆరవ వారంలో మంచి ఓటింగ్ అందుకున్న ఇ నయ సుల్తానా ఈ వారం మాత్రం ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు పడ్డాయి.ఇక ఈ వారంలో అత్యంత తక్కువ ఓట్లు అందుకొని చివరి స్థానంలో శ్రీ సత్య నిలిచి డేంజర్ జోన్ లోకి వెళ్ళింది.