ఈవారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ తనేనా.. ఇదేం ట్విస్ట్ బిగ్ బాస్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం నాలుగవ వారం నేటితో పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే నాలుగవ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారు అనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఆదివారానికి సంబంధించిన షూటింగ్ శనివారమే పూర్తి కావడంతో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ముందుగానే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఈ వారం నలుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్నారు.

ఆర్ జె సూర్య, మోడల్ రాజశేఖర్, ఆరోహి,చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప ఈ నలుగురు డేంజర్ పొజిషన్లో ఉన్నారు. అయితే ఈ నలుగురి నుంచి తప్పకుండా ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఈ నలుగురి కంటెస్టెంట్ ల నుంచి ఆరోహి ఎలిమినేట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఆరోహి సూర్య మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఆరోహిని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు పంపారు.

ఇలా ఆరోహి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చారని అందరూ భావిస్తున్నారు. ఇక ఈవారం కెప్టెన్సీ పోటీలో కీర్తి భట్ గెలిచిన విషయం మనకు తెలిసిందే.ఇక నాలుగవ వారం పూర్తి చేసుకోవడంతో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వచ్చారు. మొదటివారం ఎలాంటి ఎలిమినేషన్ లేకపోయినా రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ క్రమంలోనే మొదటగా హౌస్ నుంచి షాని బయటకు రాగా అనంతరం అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం నేహా చౌదరి నాలుగవ వారంలో ఆరోహి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.