బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం సెప్టెంబర్ నాలుగో తేదీ ఎంత ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఐదవ వారం ఎలిమినేషన్లపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఐదవ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు.
ఈవారం నామినేషన్ లో భాగంగా ఫైమా, బాలాదిత్య, వాసంతి ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనాలు ఉండగా ఎలిమినేషన్ నుంచి బయటపడటం కోసం వీరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో భాగంగా అర్జున్, చంటి, వాసంతి, ఇనయ, బాలాదిత్య డేంజర్ పొజిషన్లో ఉన్నారు అయితే వీరిలో చలాకి చంటి హౌస్ నుంచి బయటకు వస్తున్నారని తెలుస్తోంది.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారని భావించిన చలాకి చంటి బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి చంటి బయటకు రావడానికి గల కారణం ఆయనకు హోమ్ సిక్ కావడంతో పాటు సరైన భోజనం చేయలేకపోతున్నారని అదే విధంగా పెర్ఫార్మెన్స్ కూడా పెద్దగా చేయకపోవడంతోనే తనని బయటకు పంపించాలని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి బిగ్ బాస్ నుంచి ఐదో వారం ఊహించిన విధంగానే చంటి బయటకు వెళ్లారా.. లేదా చివరి నిమిషాల్లో బిగ్ బాస్ ఇచ్చారా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని గంటలు చూడాలి.