బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కంటెస్టెంట్ జెస్సీ..?

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై మూడూ వారాలు పూర్తి కానుంది. అయితే గత సీజన్ల తో పోల్చితే ఈ సీజన్ 6 మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోతోంది. దీంతో రోజు రోజుకి షో రేటింగ్స్ దారుణంగా పడిపోవటంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు. కానీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న జెస్సి మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం గమనార్హం.

ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ ల గురించి జెస్సి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో గీతు రాయల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గీతూ రాయల్ గురించి మాట్లాడుతూ.. ఆమెకు ఓట్లు వేయవద్దని నెటిజన్లను కోరుతున్నానని జెస్సీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆమెకు ఒట్లు వేయకుండా హౌస్ నుండి పంపించేయమని ప్రేక్షకులను కోరుకున్నాడు. దీంతో గీతు గురించి జెస్సీ ఇలా కామెంట్ చేయటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

జెస్సీ చేసిన వ్యాఖ్యల పట్ల గీతు అభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయినా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న జెస్సి ఇలా మరొక కంటెస్టెంట్ గురించి మాట్లాడటం సరైనది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తనకు నచ్చిన కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేయడం కాకుండా తనకు నచ్చని వారిని ఎలిమినేట్ చేయమని చెప్పటంతో జెస్సీ ని కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.