మగాడి కష్టాన్ని ఎవరు గుర్తించరు ఎంత చేసినా వేస్ట్.. నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న డాక్టర్ బాబు?

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్‌ పరిటాల. ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన ఈయనకు డాక్టర్ బాబుగా పేరు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. ఈ విధంగా డాక్టర్ బాబు పాత్రలో నటించినటువంటి నిరుపమ్‌ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే గత కొంతకాలం పాటు ఈయన ఈ సీరియల్ కి దూరమైనప్పటికీ తిరిగి రీఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే నటుడు నిరుపమ్‌ను బుల్లితెర నటి మంజుల పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీరికి సంబంధించిన ప్రతి వీడియోని అభిమానులతో పంచుకుంటారు.ఇలా మంజుల పెద్ద ఎత్తున నగలు కొనడం బట్టలు కొనడం వంటి షాపింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా వారి ఇంట్లో జరిగే ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తారు.

ఇక వినాయక చవితి సందర్భంగా మా ఇంటి గణేష్ చతుర్దతి అంటూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా నిరుపమ్‌ పూజ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుండగా మంజుల మాత్రం ఎంతో అందంగా ముస్తాబయి వచ్చింది. ఇలా తన భార్య అక్కడికి రావడంతో చూసావా ఎన్ని పనులు చేశానో అంటూ నిరుపమ్‌ చెప్పగా ఏంటి ఇవన్నీ మీరే చేశారా అంటూ మంజుల తనపై కౌంటర్ వేయడంతో వెంటనే డాక్టర్ బాబు మగాడి కష్టాన్ని ఎప్పటికీ ఎవరు గుర్తించరు ఎంత చేసినా వేస్ట్.. నేను ఇంత పని చేస్తే నువ్వు మాత్రం అందంగా రెడీ అయి వచ్చి ఎలా ఉందని అడుగుతావా అంటూ తనపై కౌంటర్ వేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.