కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. అయితే కచ్చితంగా పాటించాల్సిన వాస్తు చిట్కాలివే!

నిర్మించే ఏ ఇంటికి అయినా వాస్తు కచ్చితంగా ఉండాలి. వాస్తు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఇంటిని అద్దెకు ఇవ్వడం లేదా అమ్మడం సాధ్యమవుతుంది. ప్రశాంతంగా జీవనం సాగించాలని భావించే వాళ్లు వాస్తు విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. వాస్తు బాగున్న ఇంట్లో ఉంటే అంతా శుభమే జరుగుతుందని వాస్తు నిపుణులు సైతం వెల్లడిస్తున్నారు.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వల్ల మనకు ఏవైనా ఇబ్బందులు ఎదురైన సమయంలో ఆర్థికంగా ఆ ఇల్లే ఆదుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ప్రవేశద్వారం తలుపులు నలుపు రంగులో కాకుండా ఇతర రంగులలో ఉంటే మంచిది.

తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో లివింగ్ రూమ్ ను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు. పశ్చిమ లేదా నైరుతి దిశలో ఫర్నీచర్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా వాస్తు దోషాలకు సైతం చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. డైనింగ్ హాల్‌ను పశ్చిమ భాగంలో లేదా తూర్పు లేదా దక్షిణ దిశలలో ఏర్పాటు చేసుకోవాలి.

పడక గదులు నైరుతి దిశలో ఉండటం వల్ల మంచి ఆరోగ్యం పొందడంతో పాటు బలమైన సంబంధాలను కలిగి ఉండవచ్చు. మంచానికి ఎదురుగా అద్దం లేదా టెలివిజన్ ఉండకూడదు. ఈ విధంగా ఉంటే చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.