సుడిగాలి సుదీర్ డాన్స్ చేస్తుంటే ముక్కు నుంచి కారిన రక్తం… అసలేం జరిగిందంటే?

సుడిగాలి సుదీర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సుధీర్ కు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన తాజాగా నటించిన సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి సుధీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో నీ కళ్ళే దీవాలి అనే పాట చిత్రీకరణ కోసం
కోసం లద్దాఖ్ వెళ్లామని, భూమి కంటే 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూట్ కోసం వెళ్లామని అన్నాడు. అయితే అక్కడ చల్లని వాతావరణం ఉండడంతో ఆక్సిజన్ సిలిండర్లు కూడా వెంట తీసుకెళ్లామని తెలిపారు. అయితే అక్కడ దాదాపు మైనస్ 30 డిగ్రీస్ చలిలో ఈ పాట షూటింగ్ చేయాల్సి వచ్చింది.ఇలా ఈ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చాలామంది బ్రీతింగ్ సమస్యతో కూడా బాధపడ్డారని తెలిపారు.

వెనతిరిగి వద్దామని ప్రయత్నించగా నిర్మాతలు చాలా నష్టపోవాల్సి ఉంటుందని అలాగే అందరం ఆ చలికి తట్టుకొని షూటింగ్ చేశామని సుదీర్ వెల్లడించారు.ఈ సినిమాలో పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆ చలి తీవ్రతకు తన ముక్కులో నుంచి తరచూ రక్తం కారేదని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇలా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి సుధీర్ అసలు విషయం వెల్లడించడంతో సినిమా పట్ల సుధీర్ కు ఉన్నటువంటి డేడికేషన్ కి తన అభిమానులు ఫిదా అవుతున్నారు.