హైపర్ ఆదిని స్టార్ కమెడియన్ గా నిలబెట్టిన అభి పరిస్థితి ఏంటి ఇలా మారిపోయింది…?

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆది అదిరే అభి సహాయంతో జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత అభి ప్రోత్సాహంతో స్క్రిప్ట్ రైటర్ గా మారి.. తనదైన శైలిలో పంచులు సెటైర్లు వేస్తూ కమెడియన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అభి సహకారంతో పాపులర్ అయిన ఆది అభి టీం నుండి బయటికి వచ్చి హైపర్ ఆది రైజింగ్ రాజు అని కొత్త టీం ఏర్పరచుకొని టీం లీడర్ స్థాయికి ఎదిగాడు.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు ఆది పై ఆధారపడి నడుస్తున్నాయని చెప్పటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ షోలలో ఆది సందడి లేకపోతే ఆ షో రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. కొంతకాలం జబర్దస్త్ కి అది దూరం అవ్వటంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి మళ్ళీ అది ఇటీవలరీ ఇవ్వడంతో జబర్దస్త్ మళ్లీ పుంజుకుంది. ఇలా అభి సహకారంతో జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగి బుల్లితెర మెగాస్టార్ గా ఆది గుర్తింపు పొందాడు. అంతేకాకుండా జబర్దస్త్ వల్ల వచ్చిన పాపులారిటీతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటున్నాడు

ఇలా ఆదిలో ఉన్న టాలెంట్ ని అందరి ముందు నిరూపించుకునే అవకాశం కల్పించి ఆదికి గురువుగా వ్యవహరించిన అదిరే అభి పరిస్థితి మాత్రం ఇప్పుడు దారుణంగా తయారయింది. రెమ్యూనరేషన్ కారణంగా జబర్దస్త్ కి దూరమైన అభి ఆ తర్వాత మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే షోలో టీం లీడర్ గా సందడి చేశాడు. అయితే కొంతకాలానికే ఆ షో మూతపడటంతో ప్రస్తుతం అవకాశాలు లేక అభి ఖాళీగా ఉంటున్నాడు. అందువల్ల తిరిగి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి తన జీవితాన్ని కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అభి పరిస్థితి ఇలా దారుణంగా తయారవడంతో ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది కమీడియన్లని ఇండస్ట్రీకి అందించిన అభి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని విచారణ వ్యక్తం చేస్తున్నారు.