క్యాస్టింగ్ కౌచ్ పై విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు.. ప్రతిచోట ఇలాంటి ఇబ్బందులు తప్పవు?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా అనే షోలో సుధీర్ తో కలిసి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది. విష్ణు ప్రియ యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలో నటిస్తూ నటిగా కూడా పాపులర్ అయింది. ఇటీవల రాఘవేంద్రరావు సమర్పణలో విడుదలైన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో కూడా నటించింది.

ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. విష్ణు ప్రియ నటి మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. డాన్స్ పట్ల ఎంతో ఇష్టం ఉన్న విష్ణు ప్రియ తరచూ డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఇటీవల ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో డాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో విష్ణు ప్రియ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఈ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని..అన్ని రంగాల్లోనూ మహిళలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. మేల్ డామినేషన్ ఉన్న ఈ సమాజంలో వారు హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేక మహిళల్ని ఇలా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తనకి కూడా అలాంటి సమస్యలు ఎదురయ్యాయని కాకపోతే తాను ఆ మార్గాన్ని ఎంచుకోలేదని విష్ణు ప్రియ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.