తన కుటుంబ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్న వెన్నెల… అఖిల్ కి క్లాస్ పీకిన జెస్సి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే తన నాన్నమ్మ దగ్గర ఉన్నటువంటి వెన్నెల తిరిగి ఇంటికి వస్తుంది. అఖిల్ తనని తన ఇంటికి కాకుండా వాళ్లు ఉంటున్న చిన్న ఇంటికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్లడంతో వెన్నెల అక్కడ పరిస్థితులన్నీ చూసి ఏం జరిగిందో అని కంగారుపడుతుంది. అయితే తన తండ్రి వీల్ చైర్ కి పరిమితం కావడంతో కుటుంబ పరిస్థితులను తలుచుకొని, ఆరోగ్యంగా ఉన్న తన తండ్రి అలా ఉండడం చూసి వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఇలా మనం ఆ ఇల్లు వదిలి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడగడంతో మల్లికా జరిగినది మొత్తం చెబుతుంది.వెంటనే రామ త్వరలోనే మనం అప్పు తీర్చేసి ఆ ఇంటికి వెళ్లిపోతున్నాం అనడంతో చెప్పినంత సులభం కాదు అన్ని లక్షల అప్పు తీర్చడం అంటే అని జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఇక మల్లిక నీలావతికి ఫోన్ చేసి గుడిలో జరిగిన దానికి తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో ఆ మాటలన్నీ విష్ణు వింటాడు.వెన్నెల వచ్చి మళ్లీ ఈ ఇంటి మీద పడిందని నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో విష్ణు మా చెల్లి గురించి ఇలా మాట్లాడతావా అంటూ తనపై అరుస్తాడు. అయితే మల్లి ఇక మాత్రం ఇప్పుడే మనం ఇంత అప్పుల్లో ఉన్నాం. మీ నాన్నమ్మ దగ్గర ఉంటే వెన్నెల పెళ్లి తనే చేసేది ఇప్పుడు మరీ మనం అప్పు చేసి వెన్నెల పెళ్లి చేయాలి అని చెబుతుంది.

మల్లిక ఇలా చెప్పేసరికి విష్ణు కూడా ఇది కూడా నిజమే కదా ఇప్పటికీ చెల్లెలు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తాడు. ఇక జ్ఞానంభ తన కూతురికి భోజనం తిని పెడుతూ ఉండగా కరెంట్ పోవడంతో జానకి కొవ్వొత్తి తీసుకు వస్తుంది. వదినకు కూడా వడ్డించు అమ్మ అనడంతో జ్ఞానంభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.దీంతో వెన్నెల ఏదో జరిగిందని మనసులో బాధపడుతుంది. ఇక వెన్నెల తన తల్లి వద్ద నేలపై పడుకోవడంతో అది చూసిన రామా దీనంతటికీ కారణం నేనే నా వల్లే వీరంతా ఇబ్బంది పడుతున్నారని బాధపడుతూ ఉండగా జానకి తనని ఓదారుస్తుంది.

ఇలా ఇంటి పరిస్థితులు తలుచుకొని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉండగా అఖిల్ మాత్రం తనకు ఏమాత్రం సంబంధం లేదని ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడు. అది చూసిన జెస్సి ఇలా ఇంట్లో ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చోక పోతే బయటికి వెళ్లి ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదా అంటూ తనని తిడుతుంది.నువ్వు కూడా మా వదిన మాయలో పడి నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు అంటూ అఖిల్ మరోసారి జానకిని అపార్థం చేసుకొని తిట్టగా జెస్సి మాత్రం నువ్వు ఇంట్లో కూర్చుని తినడానికి నువ్వు ఈ ఇంటి అల్లుడు ఏమి కాదు ఇంటికి కొడుకువి నీకు కూడా బాధ్యత ఉంటుంది వెళ్లి పని చూసుకో అంటూ తనకు బాగా క్లాస్ పీకుతుంది.