కార్తీకదీపం సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న వంటలక్క.. సంతోషంలో అభిమానులు?

బుల్లితెర పై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కార్తీకదీపం సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా బల్లితెర ప్రేక్షకులను బాగా సందడి చేసిన వారిలో ప్రేమ విశ్వనాధ్ ఒకరు. ఈమె నిజానికి కేరళ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ అయినప్పటికీ కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటించారు. ఇక ఈ సీరియల్ ద్వారా ఈమె దీప అనే పేరు కన్నా వంటలక్క అనే పేరుతో బాగా పాపులర్ అయ్యారు.

ఈ విధంగా కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమెను ఈ సీరియల్లో చనిపోయినట్టు చూపించి ఈమె పాత్రను తొలగించారు. ఇలా ఈ సీరియల్ నుంచి డాక్టర్ బాబు వంటలక్క వెళ్లిపోవడంతో ఈ సీరియల్ కి కాస్త రేటింగ్ కూడా తగ్గిందని చెప్పాలి. అయితే ఈ సీరియల్ లోకి తిరిగి వంటలక డాక్టర్ బాబు ఏదో రూపంలో వస్తే బాగుండని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అయితే అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరుతుందని తెలుస్తుంది.

ఈ క్రమంలోని ప్రేమ విశ్వనాథ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వస్తున్న మీకోసం అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో ఈమె కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్ర కోసం ఎలా ముస్తాబవుతారో అలాగే రెడీ అయ్యి సందడి చేశారు. దీప మేడం షాట్ రెడీ అనగానే వస్తున్నా అంటూ ఉన్న వీడియోని షేర్ చేసారు. ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా వంటలక్క ఈ కార్యక్రమంలోకి తిరిగి వస్తుందని తెలుస్తుంది. అయితే ఈమె తిరిగి ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తారనే విషయం గురించి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ రేటింగ్ మరోసారి టాప్ పొజిషన్ కి వెళ్లడం ఖాయం.