వామ్మో జబర్దస్త్ షబీనా లవ్ స్టోరీ మామూలుగా లేదు.. ఆ ఏజ్ లోనే ప్రేమలో పడిన బ్యూటీ?

బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షబీనా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.బుల్లితెరపై కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటించిన షబీనా అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో నటించి సందడి చేశారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మున్నా (సలీం)అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నట్లు ఈమె వెల్లడించారు.

తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా వీరి ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.అసలు వీళ్లది పెద్దలకు కుదిర్చిన వివాహం కాదని ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు.అయితే ఈ ప్రేమ ఇంటర్లో ఉన్నప్పుడే మొదలైందని షబీనా చెబుతూ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలోనే వీళ్ళ లవ్ స్టోరీ గురించి చెబుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

తాను ఇంటర్ చదువుతున్న సమయంలో మీ సేవలో పని చేసేదాన్ని అయితే సలీం అక్కడికి వస్తు తనకు పరిచయమయ్యారని షబీనా తెలిపింది. అయితే తన దగ్గరకు వచ్చిన సలీం నీ నెంబర్ నాకు తెలుసు అంటూ తనతో మాటలు కలిపారు. ఇలా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని అనంతరం మా పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది అంటూ ఈమె తెలిపారు.అయితే నా నెంబర్ సలీం దగ్గరకు ఎలా వెళ్ళింది అని దాదాపు మూడు నెలల పాటు అడిగానని ఈ సందర్భంగా షబీనా తెలిపారు. అయితే మీసేవ దగ్గరికి వచ్చిన సలీం నేను బిజీగా ఉన్న సమయంలో అక్కడే ఉన్నటువంటి నా ఫోన్ తీసుకొని తన నెంబర్ డయల్ చేసి అనంతరం నా ఫోన్లో నెంబర్ డిలీట్ చేశారని అలా నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు పరిచయమయ్యారంటూ ఈ సందర్భంగా తన లవ్ స్టోరీని బయటపెట్టారు. ప్రస్తుతం తన లవ్ స్టోరీ గురించి షబీనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.