యాంకర్ అనిత చౌదరి సినిమాలకు దూరం కావటానికి అసలు కారణాలు ఇవేనా?

అనిత చౌదరి సినిమా నటి, టీవీ నటి, వ్యాఖ్యాత. యాంకరింగ్, సీరియల్స్ ద్వారా అడుగుపెట్టి వెండితెర మీద వైవిద్యమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకుంది. అనిత కలకత్తా జన్మించింది. విద్యాభ్యాసం అంతా హైదరాబాదులో కొనసాగింది. ఇంట్లో చెప్పకుండా కూచిపూడి, డాన్స్, కథక్ నేర్చుకుంది. అనిత డాన్స్ చూసిన అశోక్ రావు టెలిఫిలింలో అవకాశం ఇచ్చాడు. కానీ, అది ప్రసారం కాలేదు.

తాను ఇంటర్ చదువుతున్న రోజులలో యాంకర్లకు ఆడిషన్స్ జరుగుతుంటే బ్రహ్మానందంతో కలిసి ఒక కార్యక్రమంలో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమం హిట్ కావడంతో ఈటీవీ నుండి పిలుపు వచ్చింది. తరువాత నరేష్ తో కలిసి కౌంట్ డౌన్ కార్యక్రమం, పబ్లిక్ డిమాండ్ లైవ్ షో కార్యక్రమాలు చేసింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన కస్తూరి సీరియల్ లో అవకాశం వచ్చింది.

వరసగా ఆ సీరియల్ కి ఏడు సంవత్సరాల పాటు ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఆ తరువాత శ్రీకాంత్ హీరోగా ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన తాళి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. షూటింగ్ ఆరు నెలలపాటు రాజమండ్రిలో ఉంటుంది అంటే ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత 1999లో విక్టరీ వెంకటేష్ నటించిన రాజా చిత్రంలో టీవీ యాంకర్ పాత్ర అవకాశం వస్తే నటించి ఆ తరువాత దాదాపు 50 కి పైగా సినిమాలలో సహాయక పాత్రల్లో నటించింది.

ఒక ఎన్నారై ను వివాహం చేసుకొని బుల్లితెరకు దూరమైంది. వీరికి ఒక బాబు సంతానం కాక బాబును చూసుకునేందుకు కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తుంది. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ కావడంతో అక్కడ ఉన్న తెలుగువారితో కలిసి వారి సక్సెస్ఫుల్ జీవితాలను ఈటీవీ ద్వారా బుల్లితెరకు చూపిస్తుంది. ఒక చారిటీ సంస్థను స్థాపించి సేవలు కూడా చేస్తుంది. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తానని పేర్కొంది. మొత్తానికి కుటుంబం కోసం ఇండస్ట్రీకి కాస్త దూరమైనట్లు తెలుస్తుంది.