బిగ్ బాస్ హిమజా ఇంట్లో పడ్డ దొంగలు… సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగను గుర్తించిన హిమజ?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బుల్లితెర నటిగా ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించిన హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సీరియల్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన హిమజ ఆ తర్వాత సినిమాలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రచారం అవుతున్న అనేక టీవీ షోస్ లో కూడా హిమజ సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హిమజ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, వెకేషన్ వీడియోస్ అంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీడియో రూపంలో యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో హిమజ షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇలా పాపులర్ అయిన హిమజ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయిన హిమజ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం హిమజ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల హిమజా ఇంట్లో దొంగలు చొరబడి ఆమె బెంజ్ కార్ ని ద్వంశం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక తాజాగా తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి స్పందించిన హిమజ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియో చేసింది. ఈ క్రమంలో తన కారుని నాశనం చేసిన దొంగని పట్టుకోవడానికి దాదాపు మూడు గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ దొంగని గుర్తించినట్లు హిమజ వెల్లడించింది. అయితే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతనిలో మార్పు వస్తుందేమో చూడాలని ప్రయత్నించింది. అయితే హిమజ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ప్రజలలో అవేర్నెస్ కల్పించటం. మన జాగ్రత్తలో మనం ఉన్నప్పటికీ సీసీ కెమెరాల వల్ల ఎంతో ఉపయోగం ఉందని హిమజా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.