బుల్లితెర నటి విష్ణు ప్రియ బర్త్ డే కి తులాల కొద్ది బంగారం కొన్న భర్త…? వైరలవుతున్న వీడియో…!

త్రినయని, కుంకుమ పువ్వు, ఇద్దరమ్మాయిలు, అభిషేకం వంటి సీరియల్స్ ద్వార మంచి గుర్తింపు పొందిన నటి విష్ణు ప్రియ. ఉంగరాల జుట్టుతో చిలిపి నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన సిద్ధార్థ వర్మని వివాహం చేసుకుంది. సిద్ధార్థ వర్మ ప్రస్తుతం అగ్నిపరీక్ష తదితర సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఇలా ఇద్దరు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోన్ టు వీడియోస్ షాపింగ్ వీడియోస్ చేస్తే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇటీవల విష్ణు ప్రియ పుట్టినరోజు సందర్భంగా షాపింగ్ కి వెళ్ళింది. అయితే పుట్టినరోజు కోసం బట్టలు కాకుండా ఏకంగా బంగారం కొనటానికి వెళ్ళింది. ఈ క్రమంలో గోల్డ్ షాప్ కి వెళ్లిన విష్ణు ప్రియ తనకు నచ్చిన గాజులు, నెక్లెస్‌, ఇయర్‌ రింగ్స్‌లు సెలెక్ట్ చేసుకుంది. అయితే విష్ణుప్రియ సెలెక్ట్ ఆ నగలు దాదాపు 200 గ్రాములు ఉన్నట్లు వెల్లడించింది. పుట్టినరోజు కోసం విష్ణుప్రియ ఎంతో ఇష్టపడి సెలెక్ట్ ఆ నగలకు సిద్దార్థ్ వర్మ బిల్లు చెల్లించి తన భార్యకు కానుకగా ఇచ్చాడు. బంగారం లాంటి భార్య పుట్టినరోజు కోసం బంగారం కానుకగా ఇవ్వలేనా అని అంటున్నాడు.

ఇటీవల యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విష్ణు ప్రియ, సిద్దార్థ్ వర్మ వరుస సీరియల్స్ లో నటిస్తూ సంపాదించడమే కాకుండా ఇలా యూట్యూబ్ వీడియోలు ద్వారా కూడా బాగనే సంపాదిస్తున్నారు. యూట్యూబ్ లో వీరికి అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికి విష్ణుప్రియ తన పుట్టినరోజు కోసం భర్త చేత బంగారు నగలు కొనిపించుకుంది.