అన్ స్టాపబుల్ సీజన్ 2 తెదేపా పార్టీ కోసమే పెట్టారు.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్?

బాలకృష్ణ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన ఒకవైపు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా హీరోగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం రెండవ సీజన్ కూడా ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.మొదటి సీజన్లో కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించిన బాలకృష్ణ రెండవ సీజన్లో మాత్రం ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేష్ హాజరయ్యారు ఇలా టిడిపికి అనుకూలంగా బాలకృష్ణ ప్రశ్నిస్తూ వారిపై సింపతిని చూపించారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏపీకి సంబంధించిన రాజకీయ ప్రశ్నలు వేస్తూ ఆయనని ఇబ్బందులలో పెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు రాజధానుల పై మీ అభిప్రాయం ఏంటి అంటూ టిడిపి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రశ్నలు వేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్ లు వీరి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.