పెళ్ళి కాకుండానే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న జబర్థస్త్ జంట.. వైరల్ అవుతున్న ఫోటోలు?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో 9 సంవత్సరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా ఈ షో ద్వారా ఎన్నో ప్రేమ జంటలు కూడా పాపులర్ అయ్యాయి. ఇలా జబర్దస్త్ లో మొదటగా పాపులర్ అయిన జంటలలో సుధీర్ రష్మీ జంట ఒకటి. యాంకర్ రష్మీ , కమెడియన్ సుధీర్ ఇద్దరు ప్రేమికులుగా బాగా పాపులర్ అయ్యారు. దీంతో వీరిద్దరూ జీవితంలో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారని ప్రేక్షకులంతా భావించారు. కానీ వీరి ప్రేమ కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే అని తర్వాత అందరికీ అర్థమయింది.

ఇక సుధీర్ రష్మీ జంట లాగే వర్ష ఇమాన్యుల్ కూడా లవర్స్ గా ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ చేసే కామెడీ కంటే లవర్స్ గానే వీరిద్దరూ ఎక్కువ ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరూ కూడా నిజంగా ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులు భావించినప్పటికీ వీరిది కూడా రేటింగ్స్ కోసం పుట్టిన ప్రేమ అని తొందరగానే అందరికీ అర్థమయింది. ఇక వీరి తర్వాత సుజాత రాకేష్ జంట కూడా ప్రేమికులుగా బాగా ఫేమస్ అయ్యారు. వారిలాగే వీరిది కూడా కేవలం టిఆర్పి కోసం పుట్టిన ప్రేమ అని అందరూ భావించారు. కానీ వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ టి ఆర్ పి రేటింగ్ కోసం పుట్టినది కాదని జీవితాంతం తోడుగా ఉండేదని అందరికీ తెలియజేశారు.

ఇలా జబర్దస్త్ ద్వారా సుజాత రాకేష్ ఇద్దరు ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా అంగీకారం తెలపడంతో వీరిద్దరూ పెళ్లి కాకుండానే చట్టాపట్టాలేసుకుని మొగుడు పెళ్ళాల్లా తిరిగేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి కాకుండానే వీరిద్దరూ కూడా హైదరాబాదులో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాకేష్ ఇంట్లో జరిగే ప్రత్యేక పూజలలో కూడా సుజాత పాల్గొంటూ సందడి చేస్తోంది. పెళ్లి కాకుండానే వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ జంటగా దిగిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.