జబర్థస్త్ లో సుధీర్ రీ ఎంట్రీని అడ్డుకున్న మల్లెమాల.. సుధీర్ చేసిన ఆ తప్పే కారణమా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత పది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని నంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు పొందింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మెజీషియన్ గా తన జీవితం ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని అంచలంచెలుగా ఎదుగుతూ టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ తో లవ్ ఎఫైర్ వల్ల సుధీర్ మరింత పాపులర్ అయ్యాడు. దీంతో ఈటీవీలో ప్రసారం అవుతున్న ప్రతి ఈవెంట్ లో సుధీర్ కి తప్పకుండా అవకాశం కల్పించేవారు.

అయితే జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సుధీర్ కి సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో జబర్దస్త్ కి దూరం అయ్యి తన సినిమా షూటింగ్ పనులు ముగించుకున్నాడు. ఇటీవల సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుధీర్ జబర్దస్త్ లో ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానని తన అభిమానులకు వెల్లడించాడు. ఈ విషయం గురించి మల్లెమాల వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించాడు. అయితే మల్లెమాల వారు మాత్రం సుధీర్ ని జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మల్లెమాలవారు సుధీర్ ని అడ్డుకోవటానికి కూడా చాలా బలమైన కారణం ఉందని తెలుస్తోంది. గాలోడు సినిమా షూటింగ్ సమయంలో మల్లెమాల యాజమాన్యం సుధీర్ కి ఏదో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలని ఫోన్ చేసినా కూడా సుధీర్ స్పందించలేదని, హీరోగా సినిమాలలో అవకాశాలు రావడంతో సుధీర్ తాను ఏ స్థాయి నుంచి వచ్చాడో అన్న విషయం మర్చిపోయాడని వల్ల వారు ఆగ్రహానికి గురయ్యారు. అందువల్ల జబర్దస్త్ స్వయంగా వారిని వేడుకున్నా కూడా మల్లెమాలవారు నో చెప్పినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో తో సుధీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.