జబర్దస్త్ లో సందడి చేసిన రోజా… వైరల్ అవుతున్న వీడియో!

బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమం 10 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకొని ఎంతోమందినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా నిలబెట్టింది.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం వరుస సినిమాలు ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ఈ కార్యక్రమానికి నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు మధ్యలోనే వెళ్లిపోగా రోజా మాత్రం తొమ్మిది సంవత్సరాల పాటు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

అయితే ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమెకు మంత్రి పదవి రావడం చేత తనపై మరిన్ని బాధ్యతలు ఉన్నాయని ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల కనుక ఈమె ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే తాజాగా మరోసారి జబర్దస్త్ వేదికపై జడ్జిగా సందడి చేశారు.

తాజాగా వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా రోజా వేదికపై సందడి చేశారు. అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…ఈ కార్యక్రమం ప్రసారమయ్యే 500 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న నేపథ్యంలో రోజా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అదేవిధంగా ఈమెకు ఈ కార్యక్రమంలో సన్మానం కూడా చేశారు.ఇక రోజా మాట్లాడుతూ తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్లను ప్రేక్షకులు మర్చిపోయారు. అయితే నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే అందుకు గల కారణం జబర్దస్త్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.