మంత్రి రోజా ముందుచూపు.. అందుకే మల్లెమాల వారితో టచ్ లో ఉంటోందా?

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రోజా ఆ తర్వాత కొన్ని సినిమాలలో తల్లి పాత్రలలో కూడా నటించింది. ఇక ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైన తర్వాత ఆ షో ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ నుండి దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఆ షోలో జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఒకవైపు ఇలా టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు రాజకీయాలలో చాలా చురుకుగా ఉండేది.

ఈ క్రమంలో నగరి నియోజక వర్గం నుండి మొదట ఎమ్మెల్యేగా గెలుపొందింది. అయితే ఎమ్మెల్యేగా గెల పొందిన తర్వాత కూడా రోజా జబర్దస్త్ లో జడ్జిగా కంటిన్యూ అయ్యింది. ఇలా ఎమ్మెల్యేగా ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే మరొకవైపు జబర్దస్త్ చర్చిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇటీవల రోజా కి మంత్రి పదవి దక్కటంతో జబర్దస్త్ కి దూరమై కేవలం తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయించాలని భావించినట్లు వెల్లడించింది. ఇక బాబ్ లో జబర్దస్త్ జడ్జిగా రోజా స్థానంలో హీరోయిన్ ఇంద్రజ కొనసాగుతోంది.

ఇక జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన రోజా జబర్దస్త్ లో స్పెషల్ ఎపిసోడ్స్ కి గెస్ట్ గా హాజరవుతోంది. ఇటీవల జబర్దస్త్ 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోజా అతిథిగా పాల్గొని సందడి చేసింది. అంతేకాకుండా జబర్దస్త్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కూడా గెస్ట్ గా హాజరవుతానని తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజా జబర్దస్త్ కి దూరం అయినా కూడా ఇలా అప్పుడప్పుడు గెస్ట్ గా హాజరవటానికి వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా ప్రస్తుతం మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తోంది.

అయితే ఈ మంత్రి పదవిలో చాలా కాలం కొనసాగటానికి అవకాశం లేదు కాబట్టి మంత్రి పదవి నుండి తప్పుకున్న తర్వాత మళ్లీ జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించే ఛాన్స్ ఉంటుందని ఇలా ముందు చూపుతో మల్లెమాల వారితో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.