రెండవ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్… ఈ వారం హౌజ్ నుండి ఇద్దరు ఔట్..?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ రోజుతో రెండు వారాలు పూర్తి కానున్నాయి. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. ఇక మొదటి వారం చివరలో ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో హౌస్మెట్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఇక రెండవ వారంలో కూడా నామినేషన్స్ కోసం కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ జరిగింది.

ఈ వారంలో బిగ్ బాస్ అందరికీ సిసింద్రీ టాస్క్ ఇచ్చాడు. అయితే వీరిలో కొంతమంది కంటెస్టెంట్లు మాత్రమే బాగా పార్టిసిపేట్ చేశారు.. మరి కొంతమంది మాత్రం గేమ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక ఈవారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఐదు మంది కంటెస్టెంట్లు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు. రాజశేఖర్ , అభినయశ్రీ, ఆదిరెడ్డి, షానీ, గీతు రాయల్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన సిసింద్రీ టాస్క్ లో గీతు చేసిన పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకుల నుండి మంచి ఓటింగ్ లభించింది. ఇక ఆది రెడ్డీ కి సోషియల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వల్ల ఈ వారం ఎలిమినేషన్ నుండి ఆదిరెడ్డి బయటపడినట్లు సమాచారం.

ఇక రాజశేఖర్ కెప్టెన్సీ పదవిలో ఉండటం వల్ల చివరి రెండు రోజులు మంచి ఓటింగ్ దక్కించుకున్నాడు. దీంతో రాజశేఖర్ కూడా ఎలిమినేషన్ నుండి బయటపడ్డాడని సమాచారం. ఇక అభినయ శ్రీ మొదటివారంలో లాగే రెండవ వారంలో కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో పాల్గొనటానికి అసక్తి చూపలేదు. దీంతో తక్కువ ఓటింగ్ వెనకబడినట్లు తెలుస్తోంది. ఇక షానీ కూడా అభినయ లాగే టాస్క్ లలో పర్ఫాం చేయలేదు అందువల్ల ఇతనికి కూడా తక్కువ ఓటింగ్ వచ్చినట్లు సమాచారం. ఇక మొదటి వారం ఎలిమినేషన్ క్యాన్సల్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన బిగ్బాస్ రెండవ వారంలో మాత్రం డబల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని హౌస్ నుండి పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతి తక్కువ ఓటింగ్ లెక్కించుకున్న అభినయశ్రీ , షాని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారని సమాచారం.