అందుకే లావయ్యానంటున్న బుల్లితెర నటి .. కన్నీరు తెప్పిస్తున్న మెరీనా ప్రెగ్నెన్సీ స్టోరీ!

అమెరికా అమ్మాయి సీరియల్ తో పాపులర్ అయిన బుల్లితెర నటి మెరీనా అబ్రహం. ఆ తర్వాత ఈమె ఉయ్యాల జంపాల సీరియల్ తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత రొమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమాతో వెండితెరపై కూడా కనిపించిన ఈ భామ సబ్కా దిల్ ఖుషి అనే హిందీ సినిమా లో కూడా నటించింది. 2017లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డును కూడా గెలుచుకున్న ఈ భామ సీరియల్ నటుడు రోహిత్ సాహ్ని ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బిగ్ బాస్ సీజన్ 6 షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ సీజన్లో ఆమె హౌస్ కి మదర్ ఇండియా గా పేరు తెచ్చుకుంది. ఈమె తన అందంతో పాటు అమాయకత్వంతో కూడా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మెరీనా దంపతులు ఇద్దరు ఎప్పటికప్పుడు తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఈ మధ్య కనిపించిన ఫోటోలలో మెరీనా కొంచెం లావుగా ఉండటంతో మెరీనా ప్రెగ్నెంట్ అనే రూమర్స్ వినిపించడంతో దానికి సమాధానం గా ఈ జంట ఒక వీడియోని రిలీజ్ చేసింది. అందులో మెరీనా మాట్లాడుతూ మీకు ముందు నా గతం గురించి చెప్తాను, 2021 లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను, కానీ మొదటి స్కానింగ్ లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. హార్ట్ బీట్ వస్తుందేమో అని మూడు నెలల పాటు ఎదురు చూసాము.

కానీ ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్పడంతో ప్రెగ్నెన్సీ క్లీన్ చేసుకున్నాను. 2022లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు బేబీకి హార్ట్ బీట్ ఉంది కానీ నా శరీరం వీక్ గా ఉండటం వలనో, ఒత్తిడి వలనో తెలియదు కానీ మళ్లీ గర్భస్రావం అయింది. అప్పుడు నా ఆరోగ్యం మరింత దిగజారి పోవడంతో డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే నేను బాగా లావు అయిపోయాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది అప్పుడే చెప్పలేను అంటూ అసలు విషయాన్ని దాటవేసింది ఈ భామ.