బిగ్ బాస్ రీ ఎంట్రీ పై స్పందించిన గీతూ రాయల్.. ఏమన్నారంటే?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ 21 మంది కంటెస్టెంట్లతో ఎంతో ఘనంగా ప్రారంభమై 11 వారాలను పూర్తి చేసుకుంది ఇలా 11 వారాలకు గాను 12 మంది కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లలో చిత్తూరు జిల్లాకు చెందిన
గీతూ రాయల్ ఒకరు. ఈమె బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని తిరిగి ఆ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా వెళ్లారు.

ఈ విధంగా హౌస్ లో అందరిని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈమె టాప్ ఫైవ్ లో ఉంటారని ప్రతి ఒక్కరు భావించారు. అయితే ఊహించని విధంగా గీతూ రాయల్ తొమ్మిదవ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో ఈమె షాక్ కి గురైంది. టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ 9వ వారం ఎలిమినేట్ కావడంతో ఈమె ఎంతగానో కృంగిపోయారు. నన్ను పంపించకండి అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేట్ కావడంతో చాలామంది ఈమె వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు సృష్టించారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమె తన రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా గీతూ రాయల్ మాట్లాడుతూ వాళ్ళు పిలిచిన పిలవకపోయినా తనకి మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.