బిగ్ బాస్ షో ద్వారా రాజశేఖర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షోలో వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ అందరికీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించి అవకాశాలు రావడంతో యువతరంలో ఈ షోపై మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు సీజన్లను విజయవంతంగా ముగించుకొని ఆరో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 పై అనేక వివాదాలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 మరో మూడు వారాల్లో ముగియనుంది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని బిగ్ బాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇక 12వ వారం కంటెస్టెంట్ రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ అయ్యింది. రాజ్ ఎలిమినేషన్ ఎదుర్కొన్నాడు. అయితే రాజ్ ఎలిమినేషన్ విమర్శలకు దారి తీసింది. కారణం నామినేషన్ లో ఉన్న హౌస్ సభ్యులు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేయాలన్న రూల్ ఉంది. ఇక్కడ మాత్రం ఫైమా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న రాజ్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రాజ్ ఈ షోకు ఎంత రెమినేషన్ తీసుకున్నాడు లీక్ అయింది. రాజ్ వారానికి రూ. 1.40 లు ఒప్పందంపై బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. రాజు ఉన్న 12 వారాలకు రూ. 16.8 లక్షలు అందుకున్నాడట. అయితే ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతవరకు స్పందించలేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఇలాగే జరిగింది అప్పుడు అప్పుడు ఫైమా మాదిరి అవినాష్ ఎవిక్షన్ పాస్ తో ఎలిమినేషన్ నుండి సేవ్ అయ్యాడు. అవినాష్ కంటే ఎక్కువ ఓట్లు అరియనాకు రావడంతో ఆమె కూడా సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ సీజన్ అత్యధికంగా 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యింది. దీంతో ఎలిమినేషన్స్ కి 14 వారాలు గడువు చాలక అడ్డదిడ్డంగా ఎలిమినేట్ చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.