‘బిగ్ బాస్ 5’ హౌస్ నుంచి ఈరోజు ఈమె ఎలిమినేషన్ అట.!

ప్రపంచం వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉన్న టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో కూడా సూపర్ హిట్ కాబడిన ఈ షో ఇప్పుడు ఐదవ సీసన్ పూర్తి చేసుకుంటుంది. మరి ఈ షో లో ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు బయటకి వచ్చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తోంది. 
 
తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఆదివారం ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్నటువంటి  కాజల్ మరియు ఆనీ మాస్టర్ లలో  మాస్టర్ ఎలిమినేట్ అయ్యిందట. మరి ఇది నిజమే కాదో తెలియాలి అంటే ఈ సండే ఫన్ డే ఎపిసోడ్ ని రాత్రి 9 గంటలకి స్టార్ మా ఛానెల్లో వీక్షించాల్సిందే. ఇక ఈ రియాలిటీ షో కి అక్కినేని నాగార్జున అదిరే హోస్టింగ్ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.