Big Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ కానున్న షణ్ముఖ్.. వైరల్ అవుతున్న పోస్ట్!

Big Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ పేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలా లేదా అనే విషయం ఓట్లపై కాకుండా బిగ్ బాస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రవి విషయంలో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవి 12వ వారం ఎలిమినేట్ కావడంతో ఈ ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర జరిగిందని పెద్దఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని రవి బాటలోనే మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ల గురించి రెండు రోజులు ముందుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి కాజల్, సిరి, మానస్ డేంజర్ జోన్ లో ఉన్నారని నిన్నటి వరకు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే ఉన్నఫలంగా నేడు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ బయటకు రానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అఫీషియల్ ఓట్స్ చూసుకుంటే షణ్ముఖ్ జస్వంత్ టాప్ టు లో ఉన్నారు. అలాంటి కంటెస్టెంట్స్ ఎలా ఎలిమినేట్ అవుతారు అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే గత రెండు వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ ప్రవర్తన వింతగా ఉండటం వల్ల ఈయన వ్యవహారశైలిని చూస్తూ ప్రేక్షకులు సైతం ఎంతో విసుగు చెందుతున్నారని,ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు కూడా అతని ప్రవర్తనను జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. ఇలా ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతూ ఏకంగా బిగ్ బాస్ నిర్వాహకులను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఈవారం షణ్ముఖ్ జస్వంత్ ను హౌస్ నుండి బయటకు పంపించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.మరి ఈ వారం నిజంగానే షణ్ముక్ బయటకు వెళ్తున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే ఇంకా రెండు రోజులు వేచి ఉండాలి.