Bigg Boss : కన్ఫర్మ్డ్ : “బిగ్ బాస్ 5” ఇంటి నుంచి ఈరోజు ఎలిమినేటెడ్ తనే.!

Bigg Boss : ఎంతో అట్టహాసంగా ఈసారి స్టార్ట్ అయ్యిన తెలుగు స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో “బిగ్ బాస్” సీజన్ 5 కూడా ఎట్టకేలకు ఫైనల్స్ కి వచ్చేస్తుంది. ఈరోజుతో ఈ వారం అయ్యిపోయింది ఇక ఈ సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే రోజులు తో ఈ సీజన్ కి చరమ గీతం పాడడమే మిగిలి ఉంది.

ఇక ఈ వారం బిగ్ బాస్ ఫైనల్ ఎలిమినేషన్ తో షో కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఇక ఈరోజు ఈవారాంతం ఎలిమినేట్ అయ్యింది ఎవరో కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈసారి సీజన్లో అసలు మోస్ట్ ఇరిటేటెడ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఆర్ జె కాజల్ ఎలిమినేట్ అయ్యినట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయ్యింది.

నిజానికి అయితే అసలు ఈమె ఈ షో స్టార్ట్ అయ్యిన రెండు మూడు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఎలాగో ఇప్పటి వరకు ఉండిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యింది. మరి ఆమె ఏ కారణాలతో ఎలిమినేట్ అయ్యిందో ఈరోజు రాత్రి చూస్తే తెలుస్తుంది.