బిగ్ బాస్ షో గురించి తెలియని వాళ్లు కూడా వచ్చారు…సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీహాన్..?

దేశవ్యాప్తంగా నంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతు ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లో పాల్గొనగా వీరిలో ఆరుగురు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడవ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడవ వారంలో కెప్టెన్సీ పదవి కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సెలబ్రిటీ టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగా ఒక్కొక్క కంటెంట్ కి ఒక్కో సినిమాలోని పాత్రను కేటాయించి అలా నటించాలని సూచించాడు. అయితే ఇంటి సభ్యులందరూ ఈ టాస్క్ ని సీరియస్ గా తీసుకోకుండా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ టైంపాస్ చేశారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిగ్ బాస్ సీరియస్ అవుతూ.. ఆసక్తి లేని వాళ్లు హౌజ్‌ ని వీడి వెళ్లిపోవచ్చని చెప్పారు. అంతేకాకుండా బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ టాస్క్ ని కూడా రద్దు చేసి ఈవారం కెప్టెన్ గా ఎవరు ఉండరని నిర్ణయించాడు.

అయితే బిగ్ బాస్ ఇలా సీరియస్ అవటంతో హౌస్ మేట్స్ అందరూ తమ తప్పు తెలుసుకొని బిగ్ బాస్ ని కాకా పట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీహాన్‌ హాజ్‌ మేట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంటి సభ్యులు ఎవరికీ సీరియెస్‌ నెస్‌ లేదని…. ఎంతసేపు టైం కి తిని పండుకోవడం సోది ముచ్చట్లు వేయటం తప్ప బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదని శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ గురించి తెలియని వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటూ శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీహాన్‌ బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌ మారాయి.