మెరీనా రోహిత్ ఇంత కాలం బిగ్ బాస్ షోలో కొనసాగుడానికి అదే కారణమా?

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి చాలా దశావతారంగా మారుతుంది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ ఆరవ సీజన్ లో ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోరాడుతున్నారు. వీరిలో బుల్లితెర జంట రోహిత్ మెరీనా జంట కూడా ఉన్నారు. బుల్లితెర మీద ప్రసారమైన సీరియల్స్ లో నటించి నటులుగా గుర్తింపు పొందిన వీరిద్దరూ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. అయితే ఈ ఆరవ సీజన్ ప్రారంభమైన నాటి నుండి వీరిద్దరూ అందరి ముందు పబ్లిక్ గానే రొమాన్స్ చేసి ఫేమస్ అయ్యారు. వీరిద్దరూ అఫీషియల్ గా భార్యాభర్తలు కావడంతో నాగార్జున కూడా షో రేటింగ్స్ కోసం వీరి రొమాన్స్ ని ఎంకరేజ్ చేశాడు.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లలో మాత్రం వీరిద్దరూ ఎక్కువగా కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ ఎప్పుడో హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు భావించారు. కానీ కొంతకాలంగా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఎలిమినేషన్లు అంత చిక్కని విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో యాక్టివ్ గా ఉంటూ ఎంటర్టైన్ చేస్తున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లందరిని వరుసగా ఎలిమినేట్ చేస్తున్నాడు. ఇక తాజాగా పదవ వారం జరిగిన ఎలిమినేషన్ లో బాలాదిత్య, వాసంతిని ఎలిమినేట్ చేశాడు.

ఇదిలా ఉండగా మెరీనా రోహిత్ జంట ఆట ఆడకపోయినా కూడా ఇంతకాలం బిగ్ బాస్ షోలో కొనసాగటానికి కారణం గురించి చర్చలు మొదలయ్యాయి. మెరీనా రోహిత్ ఇద్దరూ కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో యాక్టివ్గా పాటిస్పేట్ చేయకపోయినా కూడా ఇతరుల పట్ల సానుభూతి చూపిస్తూ మంచివాళ్లుగా ముద్ర వేసుకుంటున్నారు. ఇలా ఇతరుల పట్ల సానుభూతి చూపిస్తూ మంచివాళ్లుగా ముద్ర వేసుకొని ఇంతకాలంగా హౌస్ లో కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా కూడా బిగ్ బాస్ మాత్రం వీరిద్దరిని సేవ్ చేస్తూ వస్తున్నాడు.