వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టనున్న హాట్ యాంకర్.. ఇక రచ్చ రచ్చే?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బెగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతూ ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతోంది. ఇక మునుపటి సీజన్ ల లాగే ఈ ఆరవ సీజన్ కూడా రసవత్తరంగా సాగుతూ..మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా ఈ ఆరవ సీజన్ 8వ వారంలో ఎవరు ఊహించని విధంగా ఆర్జె సూర్య బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు సూర్యని హౌస్ నుంచి బయటికి పంపించలేదు. దీంతో సూర్య సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు బిగ్ బాస్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొందరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక హాట్ యాంకర్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నారని అందువల్లే సూర్యని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపకుండా సీక్రెట్ రూమ్ లో పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నాడని వార్తలు వినిపించాయి . కానీ ప్రస్తుతం బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిని బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇక వర్షిని బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమై ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా మరో రెండు మూడు రోజుల్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వర్షిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చి హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ పెద్ద షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వర్షిని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే మాత్రం ఈ హాట్ యాంకర్ అందాల ప్రదర్శనతో బిగ్ బాస్ మరింత కలర్ ఫుల్ గా మారుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షిని బుల్లితెర టీవి షోస్ లో అవకాశాలు లేకపోవటంతో ఇలా బిగ్ బాస్ షోలో అడుగు పెట్టడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.