ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో వల్ల ఒకా రూపాయి ఆదాయం లేదా.. మరీ దారుణం!

బుల్లితెర ఛానల్ గా గుర్తింపు పొందిన ఈటీవీ ఎన్నో ఏళ్లుగా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్, టీవీ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇతర ఏ చానల్స్ వారు ప్రసారం చేయని కొత్త కొత్త టీవీ షోలను కూడా ఈటీవీ వారు ప్రసారం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, క్యాష్, ఆలీతో సరదాగా వంటి ఎన్నో టీవీ షోస్ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ షోస్ ద్వారా ఈటీవీ వారికి అధిక ఆదాయం కూడా అందుతోంది.

అయితే ఎంతోకాలంగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఒక షో వల్ల ఈటీవీకి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా కూడా ఆ షో ని ప్రసారం చేస్తూ ఉంది. ఆ షో మరేదో కాదు సాయికుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” వావ్ ” షో. ఈ షో చాలా కాలం నుండి ఈటీవీలో ప్రసారమవుతుంది. అయితే ఈ షో ఒకటి ఈటీవీలో ప్రసారమవుతున్నట్లు చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అందువల్ల ఈ షో చూసేవారు లేక దీనిని ప్రసారం చేయటం వల్ల ఈటీవీ వారికి ఒక్క రూపాయి కూడా ఆదాయం లభించడం లేదు.

అయితే ఇన్ని సంవత్సరాలుగా నష్టాలు వస్తున్నా కూడా ఈ షో ప్రసారం చేయటానికి ఒకే ఒక కారణం ఉంది. ఈటీవీతో సాయికుమార్ కి ఉన్న అనుబంధం వల్ల ఈ షో నిలిపివేయకుండా రేటింగ్స్ రాకపోయినా కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. కేవలం సాయికుమార్ కోసం మాత్రమే మరి కొంతకాలం ఈ షోని కంటిన్యూ చేసి అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ షో స్థానంలో వేరొక కామెడీ షో ని ప్రసారం చేస్తే ఈటీవీ కి మంచి ఆదాయం ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.