బిగ్ బాస్ హౌజ్ తొడ కొట్టిన శ్రీహన్… ఇద్దరినీ కూడా లాగేస్తా అంటూ..?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమాతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అందుకుంటుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ఇటీవల ప్రారంభమైంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ ఆరవ సీజన్ ప్రస్తుతం ఏడవ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ వారంలో ఇంటి సభ్యులు ఆట మీద శ్రద్ధ చూపకుండా ఒకరితో ఒకరు గొడవ పడుతూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్లందరూ బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఫిజికల్ ఫైట్స్ కి కూడా రెడీ అవుతున్నారు.

తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరూ తమ ఆట మెరుగుపరుచుకొనేలా.. బిగ్ బాస్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులను రెడ్ అండ్ బ్లూ టీములుగా డివైడ్ చేసి టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లు అందరూ మిషన్ నుండి వచ్చే పూలను బొమ్మలను కలెక్ట్ చేసి వారి వద్ద ఉంచుకోవాలి. ఈ పోటీలో నెగ్గిన టీం నామినేషన్స్ నుండి సేవ్ అవ్వగా మిగిలిన టీం సభ్యులందరూ డైరెక్ట్ గా నామినేట్ అవుతారు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా బొమ్మలు పువ్వులను సేకరించడానికి కంటెంట్ అందరు మిషన్ వద్ద గుంపులుగా గుమ్మిగూడారు. దీంతో మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఈ క్రమంలో అర్జున్ కళ్యాణ్ శ్రీహాన్ ని మెషిన్ వద్ద నుంచి పక్కకు లాగేందుకు ప్రయత్నించగా.. శ్రీహన్ కూడా సీరియస్ గా స్పందించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. శ్రీహరి తొడ కొట్టి మరి రెచ్చిపోతు.. ఒకేసారి ఇద్దరిని లాగ గల దమ్ము ఉంది అంటూ శ్రీహాన్ గట్టిగా అరిచాడు. ఇక ఈ టాస్క్ లో రేవంత్ శ్రీ సత్య మధ్య కూడా చిన్న గొడవ జరిగింది. ఇలా కంటెస్టెంట్లు అందరూ ఆట మీద శ్రద్ధ చూపించకుండా ఫిజికల్ ఫైట్ కి సిద్ధమయ్యారు.