తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే 10 వారాలను పూర్తి చేసుకొని నేడు పదకొండవ వారం కూడా పూర్తి కానుంది. ఇప్పటికే ఈ హౌస్ నుంచి 11 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వాసంతి బయటకు వెళ్లారు.ఇలా ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లగానే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి తాను టాప్ ఫైవ్ లో కాకుండా తరువాతే స్థానాల్లో అయినా ఉంటానని భావించాను కానీ ఇలా బయటకు వస్తానని అనుకోలేదు అంటూ ఈమె తెలిపారు.అయినా తాను హౌస్ లో 70 రోజుల పాటు ఉన్నానని ఇలా 70 రోజులు ఉండడం సామాన్యమైన విషయం కాదంటూ ఈమె తెలియజేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు ఎంతో మెంటల్ టార్చర్ ఉంటుందని ఈమె తెలిపారు.
ఇలా మెంటల్ టార్చర్ ఉండటం వల్ల అక్కడికి వెళ్లే కంటెస్టెంట్లు భారీగా శరీర బరువు తగ్గుతారని తాను కూడా ఆరు కిలోల బరువు తగ్గానని ఈమె తెలిపారు. హౌస్ లో మనకు సరిపడా ఫుడ్ ఉన్నప్పటికీ ఆ టెన్షన్ కారణంగా మనం తినే ఫుడ్ మన శరీరానికి పడదు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం బిగ్ బాస్ గురించి వాసంతి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.