మీడియా ముందు సుడిగాలి సుధీర్ కు ప్రపోజ్ చేసిన యువతి.. సుధీర్ క్రేజ్ మామూలుగా లేదు?

సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెర మెగాస్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుదీర్ కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం హీరోగా అవకాశాలను అందుకుని వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇదివరకు సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు పెద్దగా గుర్తింపు రాకపోయినా తాజాగా నటించిన గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈనెల 18వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సుదీర్ అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానల్లో ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకోవడం కోసం థియేటర్ల ముందు ప్రేక్షకులను సినిమా పట్ల వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియా ఛానల్ ఒక యువతితో మాట్లాడగా ఆ యువతి సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

సుధీర్ ఇదివరకు నటించిన సినిమాల కన్నా ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, ఈ సినిమాలో సుధీర్ ఫైట్ ఎలిమెంట్స్ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ఈమె తెలియజేశారు.ఇప్పుడు కనుక సుధీర్ మీ వద్దకు వస్తే ఏం చేస్తారు అంటూ మీడియా ఆ అభిమానిని అడగగా ఒక్కసారిగా ఆ యువతి తనకి గట్టిగా ఐ లవ్ యు చెప్పడమే కాకుండా వీలైతే ఒక హాగ్ కూడా ఇస్తానంటూ సుదీర్ పట్ల తనకున్నటువంటి అభిమానాన్ని తన ప్రేమను తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుధీర్ క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది.