కాబోయే భార్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుడిగాలి…?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లుగా గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్ లో అవకాశం అందుకున్న సుధీర్ మొదట ఆ షోలో చిన్న ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సుధీర్ కి హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా నటిస్తూనే మరొకవైపు టీవీ షోలో సందడి చేస్తూ బిజీగా ఉంటున్నాడు. సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో సుధీర్ తనకి జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ కి దూరమయ్యాడు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ తన సినీ జీవితం గురించి.. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి వెల్లడించాడు. ఈ క్రమంలో జబర్దస్త్ గురించి మాట్లాడుతూ తన లైఫ్లో జబర్దస్త్ టర్నింగ్ పాయింట్ అని.. జబర్దస్త్ కి కేవలం కొంతకాలం బ్రేక్ ఇచ్చాను తొందరలోనే తిరిగి జబర్దస్త్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాను..అంటూ జబర్దస్త్ లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనకు ఈటీవీ లాగే అన్ని చానల్స్ కూడా ముఖ్యమని… తనకు కావాల్సింది ఆడియన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే అంటూ ఈ సంధర్భంగా వెల్లడించాడు.

అంతే కాకుండా రష్మి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక పెళ్లి గురించి యాంకర్ ప్రస్తావన తీసుకురాగా.. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని , ఒకవేళ తనకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలని అడగటం కూడా వేస్ట్ అని సుధీర్ తెలిపాడు. ఒకవేళ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటే..నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నాకు భార్యగా కావాలని.. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. సుదీర్ తనకి కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదిలా ఉండగా సుధీర్ హీరోగా నటించిన గాలోడు అనే సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.