హీరోయిన్ గా హిట్ అందుకున్న రష్మి… మరి ఈ సారైనా సుధీర్ హీరోగా హిట్ కొట్టేనా?

Rashmi And Sudheer performance

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మీ మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. అయితే సినిమాల ద్వారా ఆమెకు సరైన గుర్తింపు లభించకపోవడంతో జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న మూడు కామెడీ షో లలో యాంకర్ గా వ్యవహరిస్తూ రష్మీ ఫుల్ బిజీగా ఉంది. అయితే యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ.. సినిమాలలో హీరోయిన్గా రాయించాలని రష్మి చాలా ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో తన సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక ఇటీవల సింగర్ గీత మాధురి భర్త నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఇక ఇటీవల నవంబర్ 4వ తేదీన విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇలా “బొమ్మ బ్లాక్ బస్టర్” సినిమా ద్వారా రష్మీ హీరోయిన్ గా హిట్ అందుకుంది.

ఇక రష్మీ హిట్ అందుకోవటంతో ఇప్పుడు సుధీర్ వంతు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కమెడియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ హీరోగా మారి పలు సినిమాలలో నటించినప్పటికీ… ఒక్క సినిమా కూడా సుధీర్ కి
హిట్ ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం సుధీర్ హీరోగా నటించిన “గాలోడు” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సుధీర్ ఈసారైనా హీరోగా హిట్ కొడతాడా? లేదా? అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.