ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ గతంలో మాత్రం మగవారి లేడీ గెటప్స్ వేసుకొని సందడి చేసేవారు. ఆది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా లేడీ ఆర్టిస్టులు జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. అయితే ఇలా ఎంతమంది లేడీ ఆర్టిస్టులు జబర్దస్త్ లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు లేడీ గెటప్ లు వేసుకొని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.
తాజాగా బుల్లెట్ భాస్కర్ తండ్రీ కి కూడా జబర్థస్త్ పైత్యం బాగా వంటపట్టినట్టు ఉంది. బుల్లెట్ భాస్కర్ ఫ్యామిలీ స్కిట్ లో సందడి చేసిన ఆయన తండ్రి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో జబర్థస్త్ లో రెగ్యులర్ గా స్కిట్ లలో సందడి చేస్తూ ఉన్నాడు. రోహిణీ టీమ్ లో మెయిన్ ఆర్టిస్ట్ గా అప్పారావు సందడి చేస్తున్నారు. ఈ వారం ప్రసారం కాబోయే జబర్థస్త్ ఎపిసోడ్ లో కూడా అప్పారావు సందడి చేశారు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో అప్పారావు లేడీ గెటప్ వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండ మారిపోయాడు. దీంతో రష్మి కూడా ఆఖరికి అప్పారావు గారికి కూడా లేడి గెటప్ వేశారా అంటూ సెటైర్ వేసింది.
ఇక ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీనుకి ఇంద్రజ, కుష్బూ చాలా చండాలంగా మేకప్ వేశారు. దీంతో శ్రీను మాట్లాడు.. ఇదివరకు నేను చండాలంగా ఉండే వాడిని. కానీ కుష్బూ, ఇంద్రజ గారు నాకు మేకప్ వేసి వారిలా తయారు చేశారు అంటూ సెటైర్ వేసాడు. దీంతో ఇంద్రజ శ్రీనుని కొట్టడానికి వెళ్తే శ్రీను పారిపోయాడు. ఇక మరోక సందర్భంలో అవినాష్ స్కిట్ లో చేసే ఒక ఆంటీని పొగుడుతూ మీ పిల్లల కన్నా మీరే యంగ్ గా ఉన్నారు అని అంటుంది. దీంతో ఇంద్రజ ఆ వయసు వారికి అలాగే కనిపిస్తారు అంటూ రష్మి మీద పంచ్ వేస్తుంది. మొత్తనికి ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనుంది.