బిగ్ బాస్ ఫైమా ఇంటిని చూశారా… వైరల్ అవుతున్న హోం టూర్ వీడియో!

జబర్థస్త్ లేడి కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట పటాస్ షో ద్వారా తన కామెడీతో బుల్లితెర పేక్షకులను ఆకట్టుకున్న పైమా ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకుంది. జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీం లో మెయిన్ కంటెస్టెంట్ గా చేస్తున్న ఫైమా తన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఫైమా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకొని బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళింది.

అయితే ఇటీవల కాలంలో ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటిలుగా గుర్తింపు పొందిన వారందరూ హోమ్ టూర్స్ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కటిక పేదరికం నుండి బిగ్ బాస్ షో కి వెళ్ళే స్థాయికి ఎదిగిన ఫైమా హోమ్ టూర్ ని ఇటీవల సుమన్ టీవీ వారు నిర్వహించారు. ప్రస్తుతం ఫైమా బిగ్ బాస్ హౌజ్ లో ఉండటం వల్ల ఫైమా అమ్మ గారు సుమన్ టీవీ ఇంటర్య్వూ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫైమా అమ్మ గారు వారి కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలను సుమన్ టీవి తో షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఫైమా జబర్దస్త్ కి రాకముందు తాము ఎన్నో కష్టాలు అనుభవించామని, పైమా జబర్దస్త్ కి వెళ్ళిన తర్వాత తమ పరిస్థితి మారిపోయిందని ఆవిడ వెల్లడించారు. ప్రస్తుతం తను, ఫైమా మాత్రమే ఇంట్లో ఉంటున్నట్లు ఆవిడ చెప్పుకొచ్చారు. ఫైమా హోమ్ టూర్ లో భాగంగా చిన్నప్పుడు స్కూల్ లో ఫైమాకి ఇచ్చిన అవార్డ్స్ అన్ని చూపించారు. అంతే కాకుండా బిగ్ బాస్ షో లో ఉన్న ఫైమాకి పంపటానికి లగేజ్ ప్యాక్ చేసినట్టు ఆవిడ వెల్లడించారు. ఫైమా బిగ్ బాస్ షో కి వెళ్ళటం తనకెంతో ఆనందంగా ఉందని ఆవిడ చెప్పుకొచ్చారు.