లైగర్ సినిమా ఎఫెక్ట్… కామెడీ షో లో కూడా విజయ్ ని వదల్లేదుగా..?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా హిట్ అవ్వటంతో రౌడీ హీరోగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో మాదిరిగానే బయట కూడా విజయ్ తన
యాటిట్యూడ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక ఇటీవల విజయ నటించిన లైగర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది.

భారీ బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద బోల్తా పడి భారీ నష్టాలను చవిచూసింది. ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో విజయ్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్లాప్ అవ్వటం ఒక ఎత్తైతే సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు గురించి ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

తాజాగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా విజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ట్రోలింగ్ జరిగింది. జబర్దస్త్ లో మంచి గుర్తింపు ఏర్పరచుకున్న బుల్లెట్ భాస్కర్ ఇటీవల విజయ్ దేవరకొండ ని ఇమిటేట్ చేస్తూ… అరేయ్ ఏందీరా క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు’ అని విజయ్ లాగా భాస్కర్ డైలాగ్ చెప్పాడు. అయిన జబర్థస్త్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోలను సైతం ఇమిటేట్ చేస్తున్నారు. ఇక వీరికి విజయ్ దేవరకొండ ఒక లెక్కా చెప్పండి. మొత్తానికి లైగర్ సినిమా ప్రమోషన్స్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు తన ఇమేజ్ ని డామేజ్ చేస్తున్నాయి.