సుధీర్ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న స్టార్ మా ఆనందంలో అభిమానులు…!

సుడిగాలి సుధీర్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశం దక్కించుకొని తన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టీం లీడర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన సుధీర్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఇలా సినిమా అవకాశాలు ఎక్కువ రావటంతో తనకి గుర్తింపునిచ్చిన జబర్దస్త్ కి దూరమయ్యాడు.

సుధీర్ జబర్దస్త్ కి దూరమైన తరువాత మాటీవీలో ప్రసారం అవుతున్న టీవీ షోస్ లో కనిపించడంతో మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ కోసం సుధీర్ జబర్దస్త్ కి దూరమయ్యాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన జబర్దస్త్ ని దూరం చేసుకుని మాటీవీకి వచ్చిన సుధీర్ కి స్టార్ మా వారు కేవలం ఒక్క షో మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ లో యాంకర్ అని చెప్పి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆ షో ప్రసారం చేసి తీసేసారు. దీంతో స్టార్ మా ఛానల్ పట్ల సుధీర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ మా చానల్ వారు సుధీర్ అభిమానులు ఆనందపడేలా సుదీర్ కోసం ఒక బిగ్గెస్ట్ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షో మొత్తం సుధీర్ మీద ఆధారపడి ఉండటంతో ఈ షో ద్వారా సుధీర్ కి మంచి గుర్తింపు వస్తుందని స్టార్ మా ఛానల్ వారు భావిస్తున్నారు. దీంతో సుదీర్ విషయంలో స్టార్ మా ఛానల్ వారు తీసుకున్న నిర్ణయం పట్ల సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.