ఏంటీ అల్లు అర్జున్ కంటే సుదీర్ కు ఎక్కువ క్రేజ్ ఉందా.. సర్వేలో బయటపడిన షాకింగ్ నిజాలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ కి కమెడియన్ సుడిగాలి సుదీర్ కన్నా చాలా తక్కువ క్రేజ్ ఉందని బయటపడటంతో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఓరెంజ్ లో అల్లు అర్జున్ ఆడుకుంటున్నారు.

అసలు అల్లు అర్జున్ కన్నా సుధీర్ కి ఎక్కువ క్రేజ్ ఉండడం ఏంటి అసలు ఆ సర్వే ఏంటి అనే విషయానికి వస్తే… ఒక యూట్యూబర్ 40 వేలమంది నెటిజెన్స్ తో ఒక పోల్ నిర్వహించారు. మీకు ఈ ఇద్దరిలో ఇష్టమైనటువంటి వారు ఎవరో ఓటు వేయండి అంటూ ఒక పోల్ నిర్వహించారు.ఈ సర్వేలో భాగంగా చాలామంది నేటిజన్ లు సుధీర్ కు అనుకూలంగా ఓటు వేయడమే కాకుండా ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఏదిగారు అంటూ తనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ సర్వేలో భాగంగా 69% సుదీర్ కు ఓట్లు వేయగా కేవలం 31 శాతం మంది అల్లు అర్జున్ ను ఇష్టపడుతూ ఆయనకు ఓట్లు వేశారు.దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాన్ ఇండియా హీరో అని చెప్పుకొని అల్లు అర్జున్ కంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన సుధీర్ కు ఎంతో క్రేజ్ ఉంది అంటూ అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సుధీర్ పై ప్రశంసల కురిపించగా ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సుధీర్ కు ఎక్కువ శాతం మంది ఓటు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.