సుధీర్ హీరో అవుతాడని ఎనిమిదేళ్ల క్రితమే చెప్పాను… మెగా బ్రదర్ కామెంట్స్ వైరల్!

Nagababu

జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గాను అలాగే యాంకర్ గా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధీర్ ప్రస్తుతం బుల్లితెర వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సుధీర్ తాజాగా నటించిన గాలోడు సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 18వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ గురించి ఎంతోమంది స్పందించి సుధీర్ నటన పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు సైతం గాలోడు సినిమా గురించి స్పందించి సుదీర్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సుదీర్ నటించిన గాలుడు సినిమాకి మంచి ఆదరణ రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ద్వారా సుధీర్ మాస్ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీలో కష్టపడే వారికి ఎప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి. సుదీర్ హీరో అవుతాడని నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే చెప్పాను ఇప్పుడు అదే నిజమైంది సుదీర్ ఇలాగే కష్టపడుతూ ఇంకా మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్న అంటూ నాగబాబు వెల్లడించారు.