వామ్మో….సుదీర్ గాలోడు డిజిటల్ రైట్స్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర మెగాస్టార్ గా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుదీర్ వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించారు. ఈ విధంగా వెండితెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుధీర్ అనంతరం హీరోగా కూడా అవకాశాలను అందుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి పులి చర్ల దర్శకత్వంలో ఆయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం గాలోడు. మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నటువంటి సినిమాగా ఈ చిత్రం నవంబర్ 18 వ తేదీ విడుదల అయ్యి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుందని, గత నాలుగు రోజుల నుంచి మంచి కలెక్షన్ లు రాబట్టడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఇకపోతే ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టి బయ్యర్లకు లాభాలను తెచ్చి పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సమస్త భారీ ధరలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇలా ఈ సినిమా డిజిటల్ హక్కులు నాలుగు కోట్లకు అమ్ములు పోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.