కొడుకుతో రొమాంటిక్ డాన్స్ చేసిన సీరియల్ నటి…? ఏకిపారేస్తున్న నెటిజన్స్…!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల సెలబ్రిటీలు సామాన్యులు అని తేడా లేకుండా సోషల్ మీడియా ద్వారా అందరూ తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో సామాన్యులు సెలబ్రిటీలు అని తేడా లేకుండా వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వారు చేసే అన్ని పనులకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.

ముఖ్యంగా సీరియల్ నటీనటులు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో సందడి చేస్తున్నారు. సీరియల్స్ లో తల్లి కొడుకులుగా, తండ్రి కూతుర్లుగా నటించే వారు బయట మాత్రం రొమాంటిక్ పాటలకు డాన్సులు వేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర నటిగా మంచి గుర్తింపు పొందిన ప్రశాంతి ఈ సీరియల్ లో లాస్య పాత్రలో నటిస్తోంది. నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ప్రశాంతి ఈ సీరియల్ ద్వారా లేడీ విలన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే ప్రశాంతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలతో పాటు డాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రశాంతి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రశాంతి.. గృహలక్ష్మి సీరియల్ లో కొడుకు పాత్రలో నటిస్తున్న వ్యక్తితో రొమాంటిక్ పాటకు డాన్స్ వేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ మాత్రం .. కొడుకుతో ఇలా రొమాంటిక్ పాటలకు డాన్స్ చేయడానికి సిగ్గు లేదా అంటూ ఆమెను ఏకీపారేస్తున్నారు.