సీరియల్ భామపై సినీ నిర్మాత కన్నేశాడట.!

ఆయనో యువ నిర్మాత.! అనూహ్యంగా ఓ సీరియల్ భామ మీద కన్నేశాడట.! బ్యాక్ టు బ్యాక్ తాను నిర్మిస్తోన్న సినిమాల్లో ఆమెకు అవకాశాలిస్తున్నాడట. ఆమె కోసమే కొన్ని ‘ప్రత్యేకమైన సినిమాల్ని’ నిర్మిస్తున్నాడట కూడా.!

సినీ రంగంలో గాసిప్పులకు కొదవేం వుండదు. ఇదిగో పులి అంటే, అదిగో తోక.. అంటారు. పులీ వుండదు.. తోకా వుండదు.! మరి, ఇక్కడ సదరు సీరియల్ నటి విషయంలో సదరు యువ నిర్మాత ఆరాటం నిజమా.? కాదా.?

ఏమోగానీ, ఆమె అయితే అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చింది. పబ్లిసిటీ కూడా గట్టిగానే ఆమె గురించి జరుగుతోంది. ఆమె పేరుతో జరుగుతున్న పబ్లిసిటీ కోసం కూడా ఆ యువ నిర్మాతే గట్టిగా ఖర్చు చేస్తున్నాడన్నది ఓ ప్రచారం.

ఎవరా నటి.? ఎవరా నిర్మాత.? అదైతే ‘గప్‌చిప్’.! నిప్పు లేకుండా పొగ అయితే పుట్టదని అంటారు. సినీ రంగంలో నిప్పు లేకుండానే పొగ పుట్టేస్తుంది.