Himaja – Sreevani: తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చేస్తూ తెలుగు ప్రజలకు రోజురోజుకూ చేరువ అవుతున్న నటి హిమజ అలియాస్ హిమజ మలి రెడ్డి. తాజాగా ఆమె యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు పోస్ట్ చేయడంతో ఆమెకు పాపులారిటీ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక క్షణం తీరిక లేకుండా టీవీ ప్రోగ్రాములు, ఈవెంట్లు, సినిమా షూటింగులతో బిజీ అయిపోయింది హిమజ.
లేకపోతే అలాంటి కోవలో కోవకే చెందింది నటి శ్రీ వాణి. సీరియల్లో విలన్ పాత్రను పోషిస్తూ తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్న శ్రీ వాణి కూడా యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తుంది.
కాగా హిమజ, శ్రీవాణి కలిసి ఇటీవల ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లారు. అక్కడ జరిగిన ఓ సంఘటన శ్రీ వాణిని ఇరుకున పెట్టేసింది అని అందరూ సరదాగా అనుకుంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగగిందనే విషయం తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళితే.. ఆర్ ఆర్ ఎన్ సిల్క్స్ నూతన బ్రాంచ్ ఒకటి కొత్తపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ హిమజ, నటి శ్రీవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియా రిపోర్టర్లు వాళ్లని రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అందులో భాగంగా మీరు రోజుకు ఎన్ని చీరలు కట్టుకుంటారు అని ఒక రిపోర్టర్ అడిగగా, సీరియల్ కోసం రోజుకు చాలా రకాల చీరలు కట్టుకుంటామని, వాటిని చూసి బయట మహిళలు కూడా వాటిని కొంటారని ఆమె సమాధానం ఇచ్చారు. అప్పుడే హిమజ కల్పించుకొని ఇలాంటి రెగ్యులర్ ప్రశ్నలు కాకుండా కొత్తగా ఏమైనా అడగండి ఎలా అంటే.. ఉదాహరణకు మీ ఆయనతో ఇంతవరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టించారు.. లాంటి ప్రశ్నలు అడిగితే మీకు యూట్యూబ్ లో థంబ్ నెయిల్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తుందని మీడియా వాళ్లకే హింట్ ఇచ్చి శ్రీ వాణిని ఇరికించేసింది.