నందు లాస్య మధ్య పెరిగిన దూరం.. తలను గోడకేసి బాదుకున్న లాస్య!

కుటుంబ కథ నేపథ్యంలో బుల్లితెరపై ప్రసారమవుతు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే..తులసి తన జీతం పడటంతో తన పిల్లలకు కానుకలు తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది దీంతో తన పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు లాస్య చేసిన పనికి నందు తనని చాలా కోపగించుకొని దూరం పెడతాడు. దీంతో లాస్య తను చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతూ ఉన్నప్పటికీ నందు మాత్రం తనని క్షమించడు.

ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి చివరికి గొడవ పెద్దదవుతుంది.వీరి గొడవలోకి తులసిని కూడా తీసుకువచ్చి ఇద్దరూ గట్టిగా అరుస్తూ ఉండగా బయట మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఏం జరుగుతుందో అనే కంగారు పడుతుంటారు.ఈ క్రమంలోనే నందు నీకు జీవితాంతం సమయం ఇచ్చిన నువ్వు మారవు అంటూ తనని దూరం పెట్టడమే కాకుండా ఇక నలుగురి దృష్టిలోనే మనం భార్యాభర్తలం ఈ నాలుగు గోడల మధ్య కాదు అంటూ తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

లాస్య కోపంతో తన గదిలో ఉన్నటువంటి సామాన్లన్నీ విసిరివేయడమే కాకుండా తలను గోడకేసి బాదుకుంటుంది.ఈ విధంగా లాస్య తలను గోడకు కొట్టుకున్నప్పటికీ నందు ఏ మాత్రం పట్టించుకోడు అయితే తులసి వెళ్లి తనని ఆపి తనకు కట్టు కట్టడమే కాకుండా కొన్ని మంచి మాటలు కూడా చెబుతుంది.నందు గారు తనతో కేవలం తాలిబంధం ఉండటం వల్ల ఇన్ని రోజులు భరించారు. కానీ మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉంది మంచిగా మాటలతో తనకు దగ్గర కావాలి కానీ ఇలా చేయడం మంచిది కాదు అంటూ సర్ది చెబుతుంది.

ఇకపోతే ఈ విషయం గురించి నందుతో మాట్లాడటం కోసం తులసి వెళ్ళగా ఇది తన విషయం తానే పరిష్కరించుకుంటానని నందు సమాధానం చెబుతాడు. అయితే తులసి మాట్లాడుతూ నన్ను కాదని వదిలేసి పట్నం పిల్ల ప్రేమలో పడి తనని తెచ్చుకున్నారు ఇప్పుడు తనని కూడా వదిలేస్తున్నారు. ఇలా మీరు రోజు గొడవ పడుతూ ఉండగా ఇంట్లో వాళ్లు కూడా మనశ్శాంతిగా ఎలా ఉంటారు.కాస్త ప్రశాంతంగా ఆలోచించి వారిని క్షమించండి అంటూ తులసి చెప్పగా ఒకప్పుడు లాస్య పై తనకు ప్రేమ ఉండేదని ఇప్పుడు ఆ ప్రేమ చచ్చిపోయింది అంటూ నందు భారీ డైలాగులు వేస్తారు.