కండక్టర్ ఝాన్సీకి సినిమాలో ఆఫర్ ఇచ్చిన హీరో.. లక్ అంటే ఈమెదే?

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువతీ యువకులు తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది అధిక సంఖ్యలో ఫాలోయింగ్ సొంతం చేసుకుని పాపులర్ అవుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో చిన్న చిన్న డాన్స్ వీడియోలు చేసే ఝాన్సీ కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. గాజువాక డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే శుభకార్యాలలో డాన్సులు వేస్తూ అయింది.

ఈ క్రమంలో కండక్టర్ ఝాన్సీ టాలెంట్ ని గుర్తించిన మల్లెమాలవారు ఆమెని శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి తీసుకువచ్చారు. ఈ షో లో ఆమె పల్సర్ బైక్ పాటకి అదిరిపోయే స్టెప్పు లు వేసి అందరిని ఆకట్టుకొని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఇలా ఒక పాటతో పాపులర్ అయిన ఝాన్సీ సినిమా ఇండస్ట్రీలో అనేక టీవీ షోల లో అవకాశం పొందటమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. తాజాగా టాలీవుడ్ హీరో ఝాన్సీ కి తన సినిమాలో అవకాశం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఝాన్సీ కి అవకాశం ఇచ్చిన ఆ హీరో మరెవరో కాదు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమా ద్వార హీరోగా మారిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత చాలా సినిమాలలో హీరోగా నటించాడు. ఇక ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఝాన్సీ ని సంప్రదించగా ఝాన్సీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.